తెలుగు వివాహ పొంతన - కూటములు


మేలాపకము
వధువు:
వరుడు:

అదనపు సమాచారం:




వివాహ జాతక పొంతన - పరిచయము


వివాహ జాతక నక్షత్ర పొంతన అంటే వివాహం చేయబోయేముందు, ఒక అబ్బాయి, అమ్మాయి, మధ్య పొంతన ఉంటుందో లేదో చూసే ప్రక్రియ.

గుణ మేళనం - వర్ణ, వశ్య, దిన, యోని, గ్రహమైత్రి, గణ, రాశికూట, నాడి అని అష్ట కూటములుగా చూడటం అవుతుంది. వీటికి ఆ వరుసలో 1 నుండి 8 వరకు గుణాంకములు ఇవ్వబడ్డాయి, మొత్తం కలిపితే 36 గుణాలు. కనీసం 18 గుణాంకములు ఉంటేనే పొంతన ఉన్నట్లు చెప్పబడింది.

ఇక్కడ మీరు పాయింట్స్ మాత్రమె కాకుండా, వధూవరులకు వివిధ అష్ట కూటములు ఎలా ఉన్నాయి, వాటి నిర్వచనం ఏమిటి, వాటికి ఏవైనా మినహాయింపులు ఉన్నాయా అనే విషయాలు సవివరంగా తెలుసుకోవచ్చు. వధూ లేక వర అన్వేషణలో, ప్రాధమిక విశ్లేషణ కొరకు, ఇక్కడి సమాచారం ఉపయోగిస్తుందని ఆశిస్తాను.


గమనిక : వీటికి పరిహారాలు లేవు. ఏదో ఒక కూటమి పట్టుకుని బాలేదు అన కూడదు. గుణ బాహుళ్యం చూడటమే సరైన పొంతన వెనుక రహస్యం. ఇవి పెళ్లి అయిపోయిన వారికి, మేనరికాలకు, ప్రేమ వివాహాలకు అస్సలు వర్తించవు. ఇవి తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు వధు లేక వర అన్వేషణ ప్రయత్నంలో ప్రాధమిక నిర్ణయం తీసుకొనడానికి వాడటానికి, నేర్చుకోవడానికి ఇవ్వబడ్డాయి.

  • కూటముల గణన పట్టిక మరియు సలహా కొరకు Points బటన్ పై క్లిక్ చేయండి .
  • నా పధ్ధతి గురించి తెల్సుకునేందుకు Rules బటన్ పై క్లిక్ చేయండి .
  • వధూ లేక వరునికి అనుకూలమైన నక్షత్రముల పట్టికల కొరకు, *Vadhu లేక *Vara బటన్ పై క్లిక్ చేయండి .
  • అష్ట కూటముల గురించి వివరంగా తెలుసుకోడానికి, అదనపు సమాచారం ఏరియా వాడండి.